నేడు కేబినెట్ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే విషయమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు, జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పు వంటి అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.