'నామినేషన్ల ఉపసంహరణకు రేపే చివరి గడువు'

'నామినేషన్ల ఉపసంహరణకు రేపే చివరి గడువు'

SRPT: మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని కమిషనర్ హనుమంతరెడ్డి తెలిపారు. నిర్ణీత నమూనాలో రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి, ఎన్నికల గుర్తులను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.