గంపలగూడెంలో వైసీపీ కార్యకర్తలు సమావేశం

NTR: గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఆదివారం వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ శాఖ, వైసీపీ అనుబంధ విభాగాల నూతన కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. జిల్లా వైసీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆలపాటి ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామశాఖ అధ్యక్షులు షేక్ గౌష్, గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.