'మా గ్రామంలోనే పాఠశాల కొనసాగించండి'

CTR: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పుంగనూరు మండలం మరసనపల్లెలోని పాఠశాలను ఈడికిపల్లికి మార్చారని చెప్పారు. దీంతో విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. గత వారం గ్రీవెన్స్ డేలో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు మాజీ ఎంపీపీ నరసింహులు తెలిపారు.