VIDEO: ఎన్టీఆర్ గెటప్‌లో డోర్నకల్ ఎమ్మెల్యే
MHBD: హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026లో ఆదివారం రాత్రి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. జాటోత్ రామచంద్రు నాయక్ ఎన్టీఆర్ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుణ్య భూమి నా దేశం నమో నమామి పాటకు ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.