రైతుల సమస్యల పరిష్కారంపై సర్కార్ దృష్టి
AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తమకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలతో డిసెంబరు 15 నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్లకు పెగ్‌మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది.