భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కోఆర్డినేటర్
ప్రకాశం: కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల భవిత కేంద్రాన్ని ఐఈఆర్టీ జిల్లా కోఆర్డినేటర్ పి. నాగేంద్ర నాయక్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు భవిత కేంద్రం సేవలను సమర్ధవంతంగా అందించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు భవిత కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.