కార్యకర్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

MBNR: జడ్చర్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు సయ్యద్ మహేమూద్ జన్మదినం సందర్భంగా అతనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని సూచించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.