ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన ఎస్పీ

ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన ఎస్పీ

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రజల వద్ద నుండి సోమవారం అర్జీలను స్వీకరించారు. ప్రజలకు న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.