నాంపల్లి గుట్ట ప్రత్యేకత ఏంటంటే..?
SRCL: వేములవాడ సమీపంలో ఉన్న నాంపల్లి గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది. స్వామిని ఏ కోరిక కోరిన తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత, గుట్టపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. అందువల్ల ఇది కేవలం దేవాలయం మాత్రమే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.