రైతులకు ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన..!
BPT: అద్దంకి మండలం బొమ్మనంపాడులో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ లావాదేవీలపై కళాజాత వీధి నాటకం శనివారం ఏర్పాటు చేశారు. నాబార్డ్ సౌజన్యంతో ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వారు నగదు రహిత లావాదేవీలపై, వ్యవసాయ రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, గృహ రుణాలు, వ్యాపార మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్, వెంకటరామయ్య (బాబు), రైతులు పాల్గొన్నారు.