శ్రీశైలంలో పెరుగుతున్న భక్తుల రద్దీ

KRNL: ద్వాదశ జ్యోతిర్లింగాలో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తుండటంతో శ్రీశైలం వీధిలు పాతాళగంగ భక్తులతో సందడిగా మారాయి. ఈ క్రమంలో దేవస్థానం డ్రోన్ కెమెరాలతో తీసిన ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీ మరింత పెరగనుంది.