'గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం'
SKLM: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. అనిత స్పష్టం చేశారు. లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్ అందించడంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పి.సి.పి.యన్.డి.టి. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.