తిరుమలలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
AP: కాలినడకన వచ్చే భక్తుల రక్షణ కోసం టీటీడీ అత్యాధునిక చర్యలు చేపట్టింది. అలిపిరి మార్గంలో జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది.కాలినడకన వచ్చే భక్తులకు భరోసానిస్తున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.