రూ.2 లక్షల చెక్కు అందజేత

రూ.2 లక్షల చెక్కు అందజేత

MDK: ఆళ్లదుర్గ్ మండలం అల్లాదుర్గం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు స్థానిక SBI బ్యాంకులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం కింద ఏడాదికి రూ.436 ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన మృతి చెందగా, మంగళవారం ఆయన భార్య మంజులకు ఎస్‌బీఐ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ కుమార్, అకౌంటెంట్ అజం తదితర సిబ్బంది పాల్గొన్నారు.