'దోమల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి'

ELR: దోమల రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని పూళ్ళ PHC డాక్టర్ పీ.అరుణ జ్యోతి, ఆరోగ్య విస్తరణాధికారి లక్ష్మణరావు కోరారు. ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం కైకరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ఉదృతిని అదుపు చేయవచ్చునని సూచించారు.