VIDEO: కొండవాగుతో రెండు పంటలు పండిస్తున్న గిరిజనులు

VIDEO: కొండవాగుతో రెండు పంటలు పండిస్తున్న గిరిజనులు

PPM: కొండవాగుతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సాలూరు మండలం లొద్ద పరిసర ప్రాంతాల గిరిజనులు. కొండవాగు నీటిని వడిసి పట్టుకుని తమ పొలాలకు మళ్లించుకుంటూ వరి పంటను పండిస్తున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న భూములను చదును చేసి, పొలాలుగా మార్చుకున్నారు. ఎత్తున పారె నీరును తమ పొలాల్లోకి మళ్లించి ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో వరి పంటను పండిస్తున్నారు.