తాగి పోలీసులను ఇబ్బంది పెట్టిన వ్యక్తికి రిమాండ్: సీఐ

ADB: మద్యం తాగి పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన ఘటికే ముఖేశ్‌ను అరెస్టు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ఎస్సై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోచిగల్లీకి చెందిన ముఖేష్ మద్యం తాగి పోలీసుల విధులకు ఆటంకం కల్పించాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.