VIDEO: నూతన పోస్టాఫీస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెదపారుపూడి మండలం చినపారుపూడి గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన నూతన పోస్టాఫీస్ భవనాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోస్టాఫీస్ భవనం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.