మీ దీదీ భయపడదని మాటిస్తున్నా: ఢిల్లీ సీఎం

ఇటీవల ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దేనికీ భయపడనని చెప్పారు. అలసిపోను.. ఓడిపోను అంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఈ కార్యక్రమం వేదిక వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.