'ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు పనుల పరిశీలన'
E.G: ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన మోరంపూడి ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు మరమ్మతు పనులను జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఇవాళ పరిశీలించారు. రహదారి దుస్థితిపై ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులను ఆదేశించడంతో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నాయకులతో కలిసి పనుల నాణ్యతను పర్యవేక్షించారు.