సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు

సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు

కోనసీమ: కాట్రేనికోన మండలంలో ఏటిగట్టు అభివృద్ధి పనులు కోసం రెవెన్యూ అధికారులు గురువారం తహసీల్దార్ రవి కిరణ్ సారధ్యంలో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వేయర్, వీఆర్వోల బృందం సరిహద్దు దారులకు ముందస్తు నోటీసులు ఇచ్చి కొలతలు జరిపారు. రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిని సేకరించి ఇరిగేషన్ శాఖకు అప్పగిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు.