పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
GNTR: తాడికొండ మార్కెట్‌యార్డు పరిధి ఏటుకూరు రోడ్‌లోని భ్రమరాంభ జిన్నింగ్ మిల్లులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు.