ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని చౌదర్ పల్లి శివారులో నేషనల్ హైవే 167 పై ఈనెల 6వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గాయపడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై విజయ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచామన్నారు.