'మెగా-158' పుకార్లపై నిర్మాతలు క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మెగా-158'పై వస్తున్న పుకార్లకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ చెక్ పెట్టింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. తమ లైనప్‌లో ఉన్న చిత్రాలన్నీ యథాతథంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఏప్రిల్ 2 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని సమాచారం.