శివనగర్‌కు ఖిలావరంగల్ MRO కార్యాలయం
WGL: ఖిలావరంగల్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని వరంగల్ ఫోర్ట్ రోడ్డులో నుంచి శివనగర్ మున్సిపల్ మీసేవ కేంద్రం పై అంతస్తుకు మార్చుతున్నట్లు తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యాలయ మార్పుకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. సోమవారం నుంచి అన్ని సేవలు అక్కడి నుంచే అందిస్తామన్నారు. కార్యాలయ మార్పునకు ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.