మానవత్వం చాటుకున్న హోంమంత్రి
AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆమె క్షతగాత్రులను చూసి కారు ఆపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో సహాయం అందించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. దీంతో హోంమంత్రిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.