పెన్నా డెల్టాకు కొనసాగుతున్న నీటి విడుదల

NLR: సోమశిల జలాశయం నుంచి రైతుల అవసరాల కోసం పెన్నా డెల్టాకు 3,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 15,723 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరాయి. డ్యాం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.446 TMCల నీటిమట్టం నమోదైంది. 181 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.