స్కూటీలో నాగుపాము కలకలం..!

స్కూటీలో నాగుపాము కలకలం..!

KNR: హుజురాబాద్ పట్టణంలో హనుమాన్ దేవాలయం వద్ద పార్క్ చేసిన స్కూటీలో నాగుపాము పిల్ల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్కూటీ యజమాని షౌకత్ తన వాహనంలో పాము పిల్లను గమనించి, దానిని బయటకు తీయడానికి ప్రయత్నించాడు. స్పేర్ పార్ట్స్ విప్పి వెతకగా, పెట్రోల్ ట్యాంక్ కింద దాక్కున్న పాము పిల్లను గుర్తించి, దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.