150 వసంతాల వందేమాతరానికి వందనం

150 వసంతాల వందేమాతరానికి వందనం

SKLM: పోలాకి మండలం కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వందేమాతరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వందన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంఛార్జ్ హెచ్ఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో 150 అక్షర క్రమంలో ప్రదర్శన చేపట్టారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.