భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
BHNG: భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం 26, 25, 24వ వార్డులలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు నరసింహ యాదవ్, బెండ స్వరూప లాల్ రాజ్, చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.