జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్
JN: జిల్లాలో గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. DCP రాజమహేంద్ర నాయక్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సిలిండర్ల కొరత లేదని, డిమాండ్‌కు తగ్గట్టుగా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.