మహిళలకు రంజాన్ తోఫాలు పంపిణీ
WNP: రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమంలో భాగంగా గురువారం 4 వార్డు కౌన్సిలర్ దాసరి జమ్ములమ్మ వినాయక నగర్ కాలనీలో ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం ఇఫ్తార్ విందులు, మసీదుల మరమ్మతుల కోసం నిధులు, ఇమామ్లకు గౌరవ వేతనాలు వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు.