19 మంది మృతి.. అధికారిక ప్రకటన
TG: చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలిపింది. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ ఇద్దరూ చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు ఉన్నట్లు పేర్కొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.