'రఫ్తార్'తో రాబోతున్న కీర్తి సురేష్

'రఫ్తార్'తో రాబోతున్న కీర్తి సురేష్

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, కీర్తి సురేష్ తొలిసారి జతకడుతున్న క్రేజీ థ్రిల్లర్ 'రఫ్తార్'. విద్యా వ్యవస్థలోని చీకటి కోణాలు, కార్పొరేట్ పోటీ, సక్సెస్ కోసం సాగే సంఘర్షణే ఈ చిత్ర కథాంశం. డబ్బు, అధికారం మనుషుల సంబంధాలను ఎలా మారుస్తాయో దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ఇందులో చూపించబోతున్నాడు. ఈ మూవీని 2026  జూలై 24న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.