ఎంపీలు పార్లమెంటులో పోరాడాలి: మాజీ ఎంపీ
KDP: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలోని అంశాల అమలు కోసం ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు పోరాడాలని రాజ్యసభ మాజీ ఎంపీ తులసి రెడ్డి సూచించారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు 3 వరాలు ఇచ్చిందని అన్నారు.