ఘనంగా భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు

ఘనంగా భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు

అన్నమయ్య: రాయచోటిలోని అజయ్ కళ్యాణ మండపంలో శనివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీసీ సంఘం, రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కురువ సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కనకదాసు గొప్పతనాన్ని, భక్తి మార్గంలో సమాజాన్ని ఆధ్యాత్మికంగా ఎలా ఉద్ధరించారో వారు వివరించారు.