సత్య సాయి బాబా జయంతి వేడుకలు
ప్రకాశం: దర్శి మున్సిపల్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా దర్శి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సత్య సాయిబాబా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.