రూ.475 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
కోనసీమ: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.475 కోట్లుతో పి.గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ అన్ని పార్టీల నాయకులకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు.