భారీ వర్షాలు.. పెరిగిన ఉల్లి ధరలు

భారీ వర్షాలు.. పెరిగిన ఉల్లి ధరలు

W.G: ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. తాడేపల్లిగూడెం మార్కెట్లో ఈవారం క్వింటా రూ.1,800 నుంచి 2,400 మధ్య జరిగాయి. గతవారం రూ.1,400 నుంచి రూ.1,700 మధ్య హోల్ సేల్‌గా విక్రయించారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ఉల్లి దెబ్బతింది. అక్కడి నుంచి మార్కెట్‌కు ప్రస్తుతం రోజూ 7 నుంచి 11 లారీల మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.