నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని నిమ్మకాయల మాలలతో అలంకరించి, కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయ ఈఓ రంగారావు తెలిపారూ.