దాడులు మరింత తీవ్రతరం: ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. పౌర ప్రాంతాలపై క్షిపణి దాడులను ఆపాలని టెహ్రాన్‌ను తనతోపాటు నెతన్యాహు హెచ్చరించినట్లు తెలిపారు. అయినా ఇరాన్ దాడులు కొనసాగిస్తోందని మండిపడ్డారు. దీంతో ఆ దేశంపై దాడులను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ యుద్ధ నేరానికి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కట్జ్ పేర్కొన్నారు.