మదనపల్లె కిడ్నీ రాకెట్‌ కేసు.. ఆరుగురి అరెస్టు

మదనపల్లె కిడ్నీ రాకెట్‌ కేసు.. ఆరుగురి అరెస్టు

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర వెల్లడించారు. వారి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.