దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

MDK: ఎండలు పెరగడంతో మూగ జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతున్నాయి. దాహమేస్తోందని అడగలేవు. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మనం చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్‌లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.