పండగలతో ఆధ్యాత్మిక వాతావరణం: నీలం మధు

SRD: పటాన్‌చెరు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం చిట్కుల్‌లోని వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులతో ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రజలందరు కలిసి మెలసి పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.