'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'

'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'

ADB: ఐటిడిఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సంతోష్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ పీవో కార్యాలయ చాంబర్‌లో పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి ఐటిడిఏ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలను సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.