ఆలూరు కోనలో జలపాతం పరవళ్లు

ATP: తాడిపత్రి మండలం ఆలూరు కోనలో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రాత్రి కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీళ్లను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను చూసి టూరిస్ట్‌లు మురిసిపోతున్నారు.