'రాజా శివాజీ' టీజర్ విడుదల
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ 'రాజా శివాజీ'. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా 2026 మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.