VIDEO: బీ.కోడూరులో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం
KDP: బీ.కోడూరు మండలం మున్నెల్లిలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ పంచాయతీరాజ్ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ముఖ్య అతిథి హాజరై ఆదివారం రాత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించిందని తెలిపారు.