గిరిజనులకు దుప్పట్లు పంపిణీ
ASR: అరకులోయ మండలం, బొండం పంచాయితీ బాలియగూడ, కరకవలస గ్రామాలలో విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన ఓ వాకర్స్ అసోషియేషన్ 100 దుప్పట్లు పంపిణీ చేశారు. అరకు ఏజన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్న వేళ పంపిణీ చేసిన దుప్పట్లు చాలా ఉపయోపడతాయని గిరిజనులు సంతోషం వ్యక్తం పరిచారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.